అగ్రెసివ్‌ గాంధీ..కేసీఆర్

Thu,April 18, 2019 02:37 PM
kcr biopic title revealed by varma

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల బాట ప‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా ల‌క్ష్మీ పార్వతి కోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి విజ‌యం సాధించాడు వ‌ర్మ‌. ఈ చిత్రం ఏపీలో త‌ప్ప మిగతా అన్ని చోట్ల విడుద‌లై హిట్ కొట్టింది. ఇక ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించారు అన్న నేప‌థ్యంలో సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. తాజాగా చిత్ర టైటిల్ లోగో విడుద‌ల చేశారు. ‘ టైగర్ కేసీఆర్‌‌’ అనే సినిమా టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ.. ది అగ్రెసివ్‌ గాంధీ.. ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రూ’ అని క్యాప్షన్‌గా పెట్టారు వ‌ర్మ‌. ఇది కేటీఆర్ తండ్రి బ‌యోపిక్ అని చెబుతూ.. ఆంధ్ర పాల‌కుల రాజ్యంలో తెలంగాణ వాసులు ప‌డుతున్న ఇబ్బందుల‌ని చూసి త‌ట్టుకోలేక కేసీఆర్ ఏం చేశార‌న్న‌ది సినిమాలో చూపిస్తామ‌ని వ‌ర్మ అన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ‘కోబ్రా’ చిత్రంలో న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంతో తొలిసారి న‌టుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు వ‌ర్మ. జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ జీవిత నేప‌థ్యంలోను సినిమాలు చేస్తాన‌ని వ‌ర్మ గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే .

3558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles