ఆర్ఆర్ఆర్ నుండి మ‌రో అప్‌డేట్

Wed,March 13, 2019 12:00 PM

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్ళుగా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేక‌పోవ‌డంతో అభిమానులు కాస్త నిరాశ‌లో ఉన్నారు. కాని గ‌త నాలుగు రోజుల నుండి చిత్రానికి సంబంధించి బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్ ఫ్యాన్స్‌ని థ్రిల్‌కి గురి చేస్తున్నాయి. ఇటీవ‌ల కీర‌వాణి త‌న ట్విట్ట‌ర్‌లో హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయ‌ని ట్వీట్‌లో తెలిపారు. ఇక రీసెంట్‌గా మార్చి 14న రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆర్ఆర్ఆర్ సంస్థ‌ తెలిపింది. కొద్ది సేప‌టి క్రితం కీర‌వాణి మ‌రో అప్‌డేట్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ కోసం ప్ర‌ముఖ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ గారు పాట రాస్తున్నారు. ఆయ‌న చాలా ఫాస్ట్ అదే స‌మ‌యంలో బ్రిలియంట్ కూడా అని త‌న ట్వీట్‌లో తెలిపారు కీర‌వాణి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.3673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles