‘మిస్ ఇండియా’గా కీర్తిసురేశ్..టీజర్

Mon,August 26, 2019 05:52 PM
Keerthy Suresh Miss India title teaser revealed


మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కీర్తిసురేశ్. ఈ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. కీర్తిసురేశ్ తాజాగా మరోసారి లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తిసురేశ్ నటిస్తోన్న కొత్త సినిమా ‘మిస్ ఇండియా’. ఈ మూవీ నుంచి టైటిల్ టీజర్‌తో కూడిన స్పెషల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో కీర్తి మోడ్రన్ జీరో సైజ్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమా కోసం కీర్తిసురేశ్ 15కిలోలు బరువు తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, నరేశ్, నవీన్‌చంద్ర, నదియా, భానుశ్రీ మెహ్రా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

8732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles