వంద కోట్ల క్ల‌బ్‌లోకి 11వ సారి..

Fri,March 29, 2019 01:03 PM
kesari enters into 100 crores club

బ్రిటీష్ పాల‌నలో మ‌న‌దేశం ఉండ‌గా, ఆఫ్ఘ‌నిస్తాన్ నుండి సుమారు ప‌దివేల మంది సైనికులు మ‌న‌పై దండెత్తి వ‌చ్చారు. వారిని భార‌త సైన్యంలోని 21 మంది సిక్కు సైనికులు నిలువ‌రించారు. ఈ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం కేస‌రి. అక్ష‌య్ కుమార్, ప‌రిణితి చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు . రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. అక్ష‌య్ కుమార్ వ‌న్ మ్యాన్ షోకి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. కేవలం 7 రోజుల‌లో ఈ చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లోకి చేరింది. తక్కువ సమయంలో 100 కోట్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది కేస‌రి. ఈ చిత్రంతో అక్ష‌య్ కుమార్ చిత్రాలు 11 వసారి 100 కోట్ల క్లబ్ లో చేరిన‌ట్టయింది. వారం రోజుల త‌ర్వాత కూడా ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం విశేషం.

2875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles