TELANGANA POLYCET RESULTS 2019

ఫస్ట్ క్లాస్‌గా.. కియరా అద్వానీ, వరుణ్ ధావన్ 'క‌ళంక్' సాంగ్..!

Fri,March 22, 2019 06:04 PM
Kiara Advani And Varun Dhawan Kalank Song first class released

ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ క‌ల‌ల ప్రాజెక్ట్ క‌ళంక్ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరందుకుంటున్నాయి. 1940 కాలానికి చెందిన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రం రూపొందుతుంది. స్వాతంత్య్రం రాక‌ముందు ఓ యువ‌రాణికి, సామాన్య వ్య‌క్తికి మ‌ధ్య పుట్టిన ప్రేమ క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సిని‌మాలో సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, అలియా భట్, వరుణ్‌ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషి‌స్తు‌న్నారు.

ఇదివరకే సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచిన మూవీ యూనిట్.. తర్వాత 'ఘర్ మోరే పర్‌దేశియా' అనే సాంగ్‌ను రిలీజ్ చేసింది. తాజాగా రెండో సాంగ్ 'ఫస్ట్ క్లాస్‌'ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో కియరా అద్వానీ.. వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులేసింది. మొత్తానికి కియరా, వరుణ్ ఇద్దరు కలిసి ఫస్ట్ క్లాస్ సాంగ్‌ను ఫస్ట్ క్లాస్‌గా చేశారు. కియ‌రా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోంది.




2898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles