కైరా అద్వానీ ఇన్ స్టాగ్రామ్ వీడియో వైరల్

Tue,April 30, 2019 05:43 PM

Kiara Advani Cuts Her Hair Short Video goes viral


భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హిందీ భామ కైరా అద్వానీ. వరుస సినిమా ఆఫర్లతో బిజీబిజీగా ఉంది. కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. తన బిజీ షెడ్యూల్ వల్ల కేశ సంరక్షణపై అంతగా శ్రద్ద పెట్టని కైరా అద్వానీ..తాజాగా శిరోజాలను తనకు తానే కట్ చేసుకుంది. శిరోజాల సంరక్షణను నిర్లక్ష్యం చేశానని చెప్పిన కైరా..తన హెయిర్ ను కత్తెరతో చిన్నగా కట్ చేసి ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 'కేశ సంరక్షణను సరిగా చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే..ఒకే ఒక్క పరిష్కారం' అంటూ క్యాప్షన్ పెడుతూ కైరా అద్వానీ పోస్ట్ చేసిన ఈ వీడియోకు కొద్దిగంటల్లోనే 4 లక్షల లైక్స్ వచ్చాయి.

3338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles