బాలీవుడ్ అర్జున్ రెడ్డి ప్రేయ‌సి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sun,January 20, 2019 07:47 AM

టాలీవుడ్‌లో సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. ఈ చిత్రం తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో విక్రమ్ తనయుడు హీరోగా నటిస్తోండగా ఈ చిత్రం వ‌ర్మ అనే టైటిల్‌తో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది . ఇక హిందీ రీమేక్‌లో షాహిద్‌కపూర్ నటిస్తున్నాడు. ఆయ‌న‌కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అద్వానీ న‌టిస్తుంది. తెలుగు వ‌ర్షెన్ తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. కబీర్ సింగ్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూన్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే షాహిద్ క‌పూర్‌కి జంట‌గా న‌టిస్తున్న కియారా లుక్ తాజాగా విడుద‌ల చేశారు. ‘కబీర్‌ సింగ్‌’లో ప్రీతి అని ఫోటో ట్వీట్‌ చేశారు. తెలుగులో షాలినీ పాండేలా అదే వేషధారణలో అమాయకంగా ఆమె కనిపిస్తుంది కియారా. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. సీనీ వన్‌ స్టూడియోస్‌, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శాంతన కృష్ణన్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అమాల్‌ మల్లిక్‌ సంగీతం అందిస్తున్నారు. నిఖితా దత్‌, స్వాతి సేథ్‌ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


View this post on Instagram

Deep into Preethi for #KabirSingh

A post shared by KIARA (@kiaraaliaadvani) on

8936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles