బ‌న్నీతో జోడీ క‌ట్టే భామ ఎవ‌రో తెలుసా ?

Thu,January 3, 2019 01:25 PM

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ త‌న 19వ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్‌ని న్యూ ఇయ‌ర్ రోజున‌ ఎనౌన్స్ చేశాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బేన‌ర్‌ల‌పై నిర్మించ‌నున్నార‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌రలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, బ‌న్నీ స‌ర‌స‌న న‌టించే భామ ఎవ‌ర‌నే దానిపై అభిమానుల‌లో చ‌ర్చ న‌డుస్తుంది. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన కియారీ అద్వానీ పేరుని నిర్మాత‌లు ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. కియారా న‌టించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉండ‌గా, ప‌లు బాలీవుడ్ సినిమాల‌లోను ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. కియారా న‌టిస్తున్న విన‌య విధేయ రామ చిత్రం క‌నుక మంచి విజ‌యం సాధిస్తే ఈ అమ్మ‌డి వెనుక ఆఫ‌ర్స్ క్యూ క‌ట్ట‌డం ఖాయం అంటున్నారు.

3900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles