కాంచ‌న రీమేక్‌లో అక్ష‌య్ స‌ర‌స‌న కియారా..!

Wed,April 3, 2019 08:56 AM
Kiara Advani in the remake of horror comedy film Kanchana

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడు లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కాంచ‌న చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. కాంచ‌న సిరీస్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్నింటికి మంచి ఆద‌రణ ల‌భిస్తుండ‌డంతో లారెన్స్ కాంచ‌న సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచ‌న 3 చిత్రాన్ని తెర‌కెక్కించి నిర్మించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 19న సౌత్‌లో విడుద‌ల కానుంది. అయితే ఇన్నాళ్ళు త‌న టాలెంట్‌ని సౌత్‌కి మాత్ర‌మే ప‌రిమితం చేసిన లారెన్స్ బాలీవుడ్‌లోను అడుగుపెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో కాంచ‌న చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట లారెన్స్. శ‌ర‌త్ కుమార్ పాత్ర కోసం ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.ఇక క‌థానాయిక‌గా భ‌ర‌త్ అనే నేను ఫేం కియారా అద్వానీని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

1127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles