మెగా హీరోతో జ‌త‌క‌ట్ట‌నున్న అర్జున్ రెడ్డి భామ‌

Sun,November 3, 2019 09:30 AM

భ‌ర‌త్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన కియారా అద్వానీ అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెర‌కెక్కిన క‌బీర్ సింగ్ చిత్రంలో న‌టించింది. కబీర్ సింగ్ చిత్రం ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం కియారా అద్వానీ మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో జ‌త‌క‌ట్టేందుకు సిద్ద‌మైంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి.


వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం బాక్స‌ర్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం బాక్సింగ్ నేప‌థ్యంలో సాగుతుంది. కిర‌ణ్ కొర్ర‌పాటి చిత్రానికి ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇటీవ‌ల లాంచ్ అయిన ఈ చిత్రంలో కియారా అద్వానీని క‌థానాయిక‌గా తీసుకుంటే బాగుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కియారా గ‌తంలో మ‌రో మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ తో కలిసి విన‌య విధేయ రామ అనే చిత్రం చేసిన విష‌యం తెలిసిందే.

1974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles