కియారా టాలీవుడ్‌కి బైబై చెప్పిన‌ట్టేనా ?

Sun,August 4, 2019 09:45 AM

ఈ కాలం కుర్ర హీరోయిన్స్ దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునే పాల‌సీని చ‌క్క‌గా ఫాలో అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్ ఇలా ఏ ఇండ‌స్ట్రీ అయిన స‌రే త‌మ‌కి ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎక్క‌డుందే అక్క‌డే సెటిల‌య్యే ఆలోచ‌న చేస్తున్నారు. ర‌కుల్‌కి మంచి హిట్స్ లేక‌పోయిన వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ రావ‌డంతో హైద‌రాబాద్‌లో ఇల్లు క‌ట్టుకొని సెటిల్ అయింది. ప‌లువురు కుర్ర హీరోయిన్స్ కూడా ఇదే ధోర‌ణి సాగిస్తున్నారు. అయితే భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లో మంచి విజ‌యాన్ని అందుకున్న కియారా అద్వానీ త‌న రెండో చిత్రం విన‌య విధేయ రామ చిత్రంతో భారీ ఫ్లాప్‌ని మూట‌గ‌ట్టుకుంది. దీంతో అమ్మ‌డికి టాలీవుడ్‌లో ఆఫ‌ర్సే క‌రువ‌య్యాయి. ఇక బాలీవుడ్‌లో రీసెంట్‌గా విడుద‌లైన క‌బీర్ సింగ్ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న ఈ అమ్మ‌డికి హిందీ నిర్మాత‌లు ప‌లు అవ‌కాశాలు ఇస్తున్నార‌ట‌. దీంతో అక్క‌డే సెటిల్ అవ్వాల‌ని ఈ అమ్మ‌డు నిర్ణ‌యించుకోవాల‌ని బావిస్తుంద‌ట‌. అడిగినంత రెమ్యున‌రేష‌న్‌ని కూడా వారు ఇస్తుండ‌డంతో టాలీవుడ్‌కి బైబై చెప్పి బాలీవుడ్‌లో పాగా వేయాల‌నే అంచ‌నాకి కియారా వ‌చ్చినట్టు స‌మాచారం. దీనిపై క్లారిటీ రావ‌లసి ఉంది.

1587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles