సంపూ మ‌రో క‌ళాఖండం.. కొబ్బ‌రి మ‌ట్ట ట్రైల‌ర్

Thu,August 8, 2019 08:47 AM
Kobbari Matta Theatrical Trailer released

హృద‌య కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ ఆగ‌స్ట్ 10న కొబ్బ‌రి మ‌ట్ట అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. 2015లో కొబ్బరి మట్ట అనే చిత్రాన్ని మొద‌లు పెట్టిన, అది ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కి 10న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. కొబ్బ‌రి మ‌ట్ట చిత్రానికి సంబంధించి గ‌తంలో ప‌లు సాంగ్స్‌, టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుదల చేశారు. ఇందులోని ప‌లు డైలాగ్స్ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. క‌త్తి మ‌హేష్ ఫోటోని చూసి ఓ మ‌హిళ ఏడుస్తుంటే.. వేరే వ్య‌క్తి ఏమైంద‌మ్మా చనిపోయాడా అని అడిగితే.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌, ఏది ప‌డితే అది వాగుతున్నాడ‌ని పోలీసులు న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేశారు అని చెబుతుంది ఆ మ‌హిళ‌. ఇవే కాక కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు కొబ్బరి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు..

1232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles