క‌త్తి ట్వీట్‌కి కౌంట‌ర్ ఇచ్చిన కోన‌

Wed,January 17, 2018 11:10 AM
kona counter to kathi mahesh

నాలుగు నెల‌లుగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ అటు సోషల్ మీడియాలోనో లేదంటే ఇటు మీడియా ఛానెల్స్ లో సంచలన కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఇది ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌కపోగా, వార్నింగ్‌లు సైతం ఇచ్చారు. అయినా కత్తి మహేష్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ వివాదంపై రాజీ కుదిర్చేందుకు కోన వెంక‌ట్ రంగంలోకి దిగి జనవరి 15 వరకు అందరు మౌనంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు- కత్తి మ‌ధ్య జ‌రుగుతున్న వివాదానికి పులి స్టాప్ ప‌డ్డ‌ట్టే అని అంద‌రు భావించారు. కాని జ‌న‌వ‌రి 15 త‌ర్వాత కూడా కోన వెంక‌ట్ నుండి ఎలాంటి స‌మాధానం రాక‌పోయే స‌రికి క‌త్తి మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కోన వెంక‌ట్‌కి ట్వీట్ చేశాడు.

‘ఎక్కడున్నారు సర్‌? నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, మీరేం చేయగలరు?’ అని కత్తి మహేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కోన కౌంట‌ర్ ఇచ్చారు . ‘దురదృష్టవశాత్తు ఈ నెల 7న ట్వీట్‌ పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే అంశం మీద కొన్ని టీవీ చానళ్ల డిబేట్‌లో పాల్గొన్నావు. పవన్‌ కల్యాణ్‌, అతని అభిమానులను ఎటాక్‌ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా?’ అని కోన వెంకట్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మ‌రి స‌మ‌సిపోతుంద‌నుకున్న ఈ వివాదం రోజు రోజుకి రాజుకుంటుందే త‌ప్ప‌, ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌డం లేదంటూ ప‌లువురు వాపోతున్నారు.


5953
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles