పవన్ ఫ్యాన్స్ కి, కత్తికి డెడ్ లైన్ పెట్టిన కోన వెంకట్

Mon,January 8, 2018 04:17 PM
kona gives dead line

గత కొన్నిరోజులుగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఇటు సోషల్ మీడియా లేదంటే అటు మీడియా ఛానెల్స్ లో సంచలన కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. దీనిపై ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఫ్యాన్స్ నుంచి వార్నింగ్‌లు సైతం వ‌స్తున్నాయి. అయినా కత్తి మహేష్ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో మ‌రోసారి ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశాడు. ఈ సందర్భంలో ప్రముఖ రచయిత కోన వెంకట్ లైన్లోకి వచ్చి పవన్ ఫ్యాన్స్ కి, కత్తి మహేష్ కి డెడ్ లైన్ పెట్టాడు. గొడవలకి పులిస్టాప్ పెట్టాలని సున్నితంగా హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేశాడు. మౌనం అనేది నిజమైన స్నేహితుడు. అది ఎప్పటికి మోసం చేయదు. జనవరి 15 వరకు అందరు మౌనంగా ఉండాలని కోరుకుంటున్నాను.కత్తి మహేష్ కి కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు ట్వీట్ లో తెలిపాడు. ఛానెల్స్ లోకి వెళ్లి అక్కడ డిబెట్స్ లో పవన్ అభిమానులకి వ్యతిరేఖంగా మాట్లాడడం చేయోద్దు. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుందని ఆయన అన్నారు. మరి జనవరి 15 రోజు అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. క‌త్తి మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌ధ్య గొడ‌వ స‌ద్దుమ‌ణుగుతుందా?, కొన వెంక‌ట్ ఏం చేస్తారో చూడాలి.


3329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles