రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవల న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్‌కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించాయి. దీనిపై తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు కృష్ణం రాజు. బుధవారం కృష్ణం రాజు పెళ్ళి రోజు కావడంతో ఆయన తన సతీమణి శ్యామలాదేవితో కలిసి బంజారాహిల్స్‌లోని శ్రీ విజయ గణపతి స్వామి దేవాలయాని వెళ్ళారు. అక్కడ శతచండీ మహాయాగంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన .. ప్రతి ఒక్కిరికి దగ్గు, జలుబు, జ్వరం కామన్‌గా వస్తాయి. నాకు కూడా అలానే జ్వరం వచ్చింది. కాని దీనిపై తప్పుడు వార్తలు రాసారు. ఏదైన రాసే ముందు ఒకసారి నన్ను సంప్రదిస్తే బాగుంటుంది. నా ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకునేందుకు అభిమానులు నాన్‌స్టాప్‌గా కాల్స్ చేశారు. నా క్షేమ సమాచారం తెలుసుకుంటూ నన్ను దీవించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అని కృష్ణం రాజు పేర్కొన్నారు