త‌న ప్రేమ విష‌యాన్ని ఒప్పుకున్న కృతి

Tue,November 19, 2019 12:01 PM

మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ త‌ర్వాత తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు చిత్రాలు చేసిన అందాల భామ కృతి క‌ర్భందా. సుమంత్ హీరోగా తెర‌కెక్కిన బోణీ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు ప‌వ‌న్‌తో క‌లిసి తీన్‌మార్‌లో న‌టించింది. బ్రూస్‌లీలో రామ్‌చ‌ర‌ణ్‌కి సోద‌రిగా న‌టించింది. స్టార్ హీరోల‌తో న‌టించిన‌ప్ప‌టికి ఈ అమ్మ‌డికి మంచి స‌క్సెస్ రాక‌పోవ‌డంతో బాలీవుడ్‌కి చెక్కేసింది.రీసెంట్‌గా హౌజ్‌ఫుల్‌4లో న‌టించింది. ఈ చిత్రం మంచి హిట్ సాధించ‌డంతో కృతికి వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.


కృతి క‌ర్భందా ప్ర‌స్తుతం పాగ‌ల్ పంతీ అనే సినిమాలో చేస్తుంది. ఇందులో పుల‌కిత్ సామ్రాట్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే పుల‌కిత్, కృతి కొన్నాళ్ళుగా ప్రేమ‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విప‌రీత ప్ర‌చారం జ‌రిగింది. అది నిజ‌మ‌న్న‌ట్టు అత‌నితో చ‌క్క‌ర్లు కొట్ట‌డం, పార్టీల‌కి హాజ‌రైంది కృతి. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని ఫ్యాన్స్ బ‌ల్ల‌గుద్ది చెప్పారు. తాజాగా కృతి త‌మ రిలేష‌న్‌షిప్‌పై నోరు విప్పింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పుల‌కిత్ సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నాను. మేమిద్ద‌రం జంట‌గా సరిపోతాం కాబ‌ట్టి మా మీద పుకార్లు వ‌చ్చాయి. అయితే అవేమి పుకార్లు కాదు . నేను సామ్రాట్‌తో ప్రేమ‌లో ఉన్నాను. మేమిద్ద‌రం ఒక‌రినొక‌రు అర్ధం చేసుకోవ‌డానికి కేవ‌లం ఐదు నెల‌ల స‌మ‌య‌మే ప‌ట్టింది. త‌న‌తో మాట్లాడ‌టం నాకెంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఆయ‌న మీద ఉన్న న‌మ్మ‌కంతోనే నా ప్రేమ విష‌యాన్ని మీకు చెపుతున్నాను. ఇప్పుడు మ‌న‌శ్శాంతింగా ఉంది అని చెప్పుకొచ్చింది కృతి క‌ర్భందా.

పుల‌కిత్ సామ్రాట్ గ‌తంలో స‌ల్మాన్ సోద‌రి శ్వేతా రోహిరాని వివాహం చేసుకున్నాడు. మ‌నస్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడిపోగా, ప్ర‌స్తుతం కృతితో డేటింగ్‌లో ఉన్నాడు పుల‌కిత్‌. వీరే దీ వెడ్డింగ్ చిత్రంలో క‌లిసి న‌టించిన స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ని చెబుతున్నారు.

1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles