బడా హీరోని లైన్‌లో పెట్టిన క్షణం దర్శకుడు

Mon,April 25, 2016 10:19 AM

ఈ మద్య కాలంలో తక్కువ బడ్జెట్‌తో భారీ హిట్‌ సాధించిన చిత్రం క్షణం. రవికాంత్‌ పెరుపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అడవి శేష్‌, అనసూయ, ఆదాశర్మ ప్రధాన పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన క్షణం అన్ని రకాల ఆడియన్స్ ని అలరించడమే కాకుండా థీయేటర్ల వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అయితే ప్రస్తుతం క్షణం మూవీ డైరెక్టర్‌ తన తదుపరి చిత్రానికి ప్లాన్స్ వేసుకుంటున్నట్టు తెలుస్తుంది.


క్షణం లాంటి భారీ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన రవికాంత్‌ తన తర్వాతి చిత్రం కోసం రానాని హీరోగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌ లవ్‌ స్టోరీ నేపధ్యంలో ఉంటుందని, ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని రవికాంత్‌ తెలిపినట్టు సమాచారం. ఇక ఈ సినిమాను నిర్మించేందుకు పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

2219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles