మెగా హీరో ఫంక్ష‌న్‌కి చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్‌

Wed,December 26, 2018 07:56 AM

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ట్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ విన‌య విధేయ రామ‌. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం ఈ నెల 27న యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు. గ‌తంలోను చ‌ర‌ణ్ మూవీ వేడుక‌కి కేటీఆర్ హాజ‌రై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించిన సంగ‌తి తెలిసిందే. చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, వీడియోస్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. స్నేహా, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, అనన్య, ఆర్యన్‌ రాజేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు దేవి శ్రీ ప్ర‌సాద్ త‌నదైన శైలిలో సంగీతం అందించారు. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఇషా గుప్తా స్పెష‌ల్ సాంగ్‌తో అల‌రించనుంది. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నట్టు తెలుస్తుంది.

3041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles