ఉపాస‌న బాట‌లో కుష్బూ.. ప్ర‌ధానిపై ఫైర్

Wed,October 23, 2019 09:01 AM

మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతి వేడుక‌ల‌లో హిందీ చిత్ర ప‌రిశ్ర‌మని భాగం చేసేందుకు ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బాలీవుడ్ సినీ సెల‌బ్రిటీల అంద‌రిని త‌న ఇంటికి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. వారితో కొద్ది సేపు చ‌ర్చించిన ప్ర‌ధాని సెల్పీలు కూడా దిగారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అయితే సౌత్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ఏ క‌ళాకారుడిని ఆహ్వానించ‌క‌పోవడంపై మెగా కోడ‌లు ఉపాస‌న అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ విష‌యంపై కుష్బూ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది.


ఇండియా సినిమా త‌ర‌పున ప్ర‌ధానిని క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రికి న‌మ‌స్కారాలు అని తెలిపిన కుష్బూ.. కేవ‌లం హిందీ చిత్రాలు మాత్ర‌మే మన దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో భాగం కాద‌ని తెలిపారు. ద‌క్షిణాది చిత్రాలు దేశానికి జాతీక స్ధాయిలో ప్రాధాన్య‌త వ‌హిస్తున్నాయి. సూపర్‌స్టార్స్‌ దక్షిణాది నుంచే వస్తున్నారని, ఇండియాలోని ఉత్తమ నటీనటులు దక్షిణాదికి చెందిన వారేనని పేర్కొన్నారు. ఉత్తమ సాంకేతిక నిఫుణులు దక్షిణాదికి చెందిన వారేనన్నారు. మ‌రి ఇంత‌టి టాలెంట్ వ్య‌క్తులు ద‌క్షిణాదిలో ఉంచుకొని ఒక్క వ్య‌క్తిని కూడా మీరు ఆహ్వానించ‌క‌పోవ‌డం విడ్డూరం. ఎందుకింత ప‌క్ష‌పాతం చూపిస్తున్నారు. మ‌న‌దేశం గ‌ర్వ‌ప‌డేలా చేసిన ద‌క్షిణాది సినిమా స్పూర్తిదాయ‌కుల‌ని అయిన పిలిస్తే బాగుండేది. వారికి ఆ అర్హ‌త ఉంద‌ని నేను భావిస్తున్నాను అని కుష్బూ పేర్కొంది.

1700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles