నిజ‌మైన ఎన్టీఆర్ అభిమానుల‌కి బహిరంగ ఆహ్వానం: వ‌ర్మ‌

Sun,March 17, 2019 08:09 AM

తన సినిమాల‌ని జ‌నాల‌లోకి తీసుకెళ్ళేందుకు వ‌ర్మ వేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ముందు ఏదో ఒక వివాదంతో చిత్రంపై అంద‌రి దృష్టి ప‌డేలా చేసే వ‌ర్మ ఆ త‌ర్వాత సినిమాకి కావల‌సిన ప‌బ్లిసిటీని ఏదో ఒక రకంగా తీసుకొస్తాడు. ప్ర‌స్తుతం ల‌క్ష్మీపార్వ‌తి దృష్టి కోణం నుండి ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్న వ‌ర్మ ఈ చిత్రాన్ని మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నాడు. ఈ చిత్రం అనేక వివాదాల న‌డుమ విడుద‌ల‌కి సిద్ధ‌మ‌వుతుంది. అయితే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేసిన వ‌ర్మ క‌డ‌ప‌లో ఆడియో రిలీజ్ వేడుక జ‌రుపుతాన‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆడియోని రిలీజ్ చేస్తార‌ట‌. ఈ కార్య‌క్ర‌మానికి “వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్‌గా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్టు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. ఈవెంట్ ఎప్పుడు జ‌రుపుతామ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి నిజంగా, నిజ‌మైన ఎన్టీఆర్ అభిమానుల‌కి బ‌హిరంగ ఆహ్వానం అంటూ వ‌ర్మ ఓ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశాడు.

3724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles