ఏపీలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ఆర్జీవీ

Sat,May 25, 2019 11:27 AM
lakshmis ntr release date fixed

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ప్ప మిగ‌తా అన్ని చోట్ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ల‌క్ష్మీ పార్వతి దృష్టికోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఏపీలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని వ‌ర్మ కొంత కాలంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికి కుద‌ర‌లేదు. అయితే మే 31న చిత్రాన్ని విడుద‌ల చేసి కుట్ర‌దారుడి అస‌లు నిజాన్ని చూపిస్తాన‌ని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. అంతేకాదు ఎక్కడయితే ఎక్స్ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ స‌ర్కిల్ దగ్గర ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!! ఎన్ టి ఆర్ నిజమయిన అభిమానులకి , ఇదే నా బహిరంగ ఆహ్వానం ..జై జగన్ అని కూడా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌గా విజ‌య్ కుమార్ న‌టించ‌గా, చంద్ర‌బాబు పాత్ర‌ని శ్రేతేజ్ పోషించారు.

4181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles