మ‌హానాయ‌కుడు థియేట‌ర్‌లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్

Wed,February 13, 2019 08:29 AM
lakshmis ntr trailer release on feb 22

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఏం చేసిన అది సంచ‌ల‌నం కావ‌ల‌సిందే. ప్ర‌స్తుతం తాను తెర‌కెక్కిస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైల‌ర్‌ని మ‌హానాయ‌కుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన రోజు విడుద‌ల చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించాడు. కాని మ‌హానాయ‌క‌డు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌క‌ముందే ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు జీవీ ఫిల్మ్స్ ట్రైల‌ర్‌ విడుదల చేస్తుంది. కృతజ్ఞతలేని కుటుంబాలు, విశ్వాసంలేని అనుచరులు, వెన్నుపోటు పొడిచే ద్రోహులతో కూడిన లవ్ స్టోరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. అసలు సిసలైన కథ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ అప్పుడు ట్వీట్ వదిలారు వ‌ర్మ‌. తాజాగా మ‌హానాయ‌కుడు చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తామ‌ని బాల‌య్య అండ్ టీం ప్ర‌క‌టించే స‌రికి ఆ రోజు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర థియేట్రికల్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ట్వీట్‌లో తెలిపారు .ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని చూసేందుకు థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ కూడా చూడొచ్చంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు వర్మ.

2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles