క్రిస్మ‌స్ కానుక‌గా అమీర్ ఖాన్ చిత్రం

Wed,November 6, 2019 01:43 PM

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ చివ‌రిగా థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమిర్‌ ఫిరంగి మల్లాహ్‌ అనే నావికుడి పాత్రలో నటించారు . అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ కథానాయికలుగా నటించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది . అయితే ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో మంచి విజ‌యం సాధించిన ఫారెస్ట్ గంప్ అనే సినిమా రీమేక్‌లో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యారు అమీర్ ఖాన్. ఈ చిత్రంలో లాల్ సింగ్ చ‌ద్దా పాత్ర పోషించ‌నున్న‌ తాను 20 కిలోల బ‌రువు త‌గ్గ‌నున్నాడ‌ట‌. అడ‌విట్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంది. క‌రీనా క‌పూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం నిజాయితీగల సింపుల్టన్ యొక్క జీవిత ప్రయాణాన్ని తెలిపేలా ఉంటుంది. తద్వారా భారతీయ చరిత్ర యొక్క వివిధ దశలను వివరిస్తుంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది.1614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles