ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కన్నుమూత‌

Tue,August 20, 2019 08:51 AM
Legendary Music Composer Khayyam Dies

కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మొహమ్మద్‌ జహుర్‌ ఖయ్యాం హష్మి(93) సోమవారం రాత్రి కన్నుమూశారు. గ‌త నెల 28న ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా క్షీణించ‌డంతో ముంబైలోని సుజ‌య్ ఆసుప‌త్రిలో చేర్పించారు. గ‌త రాత్రి ఖ‌య్యాంకి కార్టియాక్ అరెస్ట్ కావ‌డంతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతికి ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. 2011లో ఖ‌య్యాం ప‌ద్మ భూష‌ణ్ అవార్డ్ అందుకున్నారు. 17 ఏళ్ళ‌కే సంగీత ప్ర‌యాణం మొద‌లు పెట్టిన జ‌హుర్ ఖ‌య్యాం ‘ఉమ్రావ్‌ జాన్‌’ ‘కభీకభీ’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న ప‌లు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయ‌న మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గాయని లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles