కొమురం భీం పాత్ర‌ కోసం కుస్తీలు ప‌డుతున్న జూనియ‌ర్

Tue,July 9, 2019 01:38 PM
Lloyd Stevens shares workout video

జూనియర్ ఎన్టీఆర్ చివ‌రిగా అర‌వింద స‌మేత చిత్రంతో ప్రేక్షకుల‌ని అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇటీవ‌ల చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌డంతో కొద్ది రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌కి బ్రేక్ ఇచ్చిన టీం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక కొమురం భీం పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. లాయిడ్ స్టీవెన్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన్నాళ్లుగా వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. తాజాగా లాయిడ్‌ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్ లెగ్‌కి సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేశాడు. ఈ ఫోటోకి కొమురం భీం, ఆర్‌ఆర్‌ఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌లతో ఎన్టీఆర్, రాజమౌళిలను ట్యాగ్ చేశాడు లాయిడ్‌. దీనికి ఎంతో కృషి చేశాం అని కామెంట్ కూడా పెట్టాడు. లాయిడ్ షేర్ చేసిన ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రామ్ చ‌ర‌ణ్ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అలియా భ‌ట్‌, సముద్ర ఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. జూలై 30,2020న చిత్రం విడుద‌ల కానుంది.

3568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles