అనుష్క సినిమాలో మాధ‌వన్.. క్లారిటీ ఇచ్చిన హీరో

Sat,January 12, 2019 01:48 PM
Maddy Clears The Rumours about silence

ఇండ‌స్ట్రీ బిజీ ఆర్టిస్ట్‌ల‌లో మాధ‌వ‌న్ ఒక‌రు. ఒక‌ప్పుడు హీరోగా అల‌రించిన మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. ఇటీవ‌ల స‌వ్య‌సాచి అనే చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడిగా క‌నిపించి అల‌రించాడు. ప్ర‌స్తుతం రాకెట్రీ అనే చిత్రం చేస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా అనుష్క చేయ‌బోతున్న ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఓ బాలీవుడ్ ప‌త్రిక కూడా మాధ‌వ‌న్ .. కోన వెంక‌ట్ సినిమాలో చేయ‌నున్న‌ట్టు క‌థ‌నం రాసింది. దీనిపై మాధ‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. హే గాయ్స్ .. నేను అనుష్క సినిమాలో చేస్తున్న‌ట్టు వ‌స్తున్న‌వార్త‌లు అవాస్త‌వం. ప్ర‌స్తుతం ఏ సినిమాలో కీ రోల్స్ చేయ‌డం లేదు అని అన్నాడు. మాధ‌వ‌న్ క్లారిటీతో అనుష్క సినిమాలో మాధ‌వ‌న్ న‌టించ‌డం లేద‌ని అర్ధ‌మైంది. మాధ‌వ‌న్ చేస్తున్న రాకెట్రీ చిత్రం ఇస్రో సైంటిస్ట్ నంబీ నారాయ‌ణ‌న్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. ఈ సినిమాపై అభిమానులల‌లో చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

అనుష్క చేయ‌నున్న థ్రిల్ల‌ర్ చిత్రానికి కోన వెంకట్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మూవీ చిత్రీక‌ర‌ణ ఎక్కువ శాతం అమెరికాలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ న‌టులు కూడా న‌టిస్తార‌ని స‌మాచారం. హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీకి సైలెన్స్ అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తెలుగు త‌మిళ భాష‌ల‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నటుడు సుబ్బరాజు కూడా చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మార్చి నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని అంటున్నారు. ఏడాది చివర్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.


2743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles