15 ఏళ్ళ త‌ర్వాత భార్య భ‌ర్త‌లుగా..

Sun,June 16, 2019 07:50 AM

మాధ‌వ‌న్, సిమ్రాన్ 15 ఏళ్ళ క్రితం బాల‌చంద‌ర్ తెర‌కెక్కించిన ప‌ర‌వశం చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆ త‌ర్వాత మ‌ణిర‌త్నం మూవీ కన్నాతిల్‌ ముథమిట్టల్‌లోను జంట‌గా నటించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. 15 ఏళ్ళ త‌ర్వాత ఈ జంట ప్రేక్ష‌కుల‌ని అల‌రించనున్న‌ట్టు తెలుస్తుంది. మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వ‌యంగా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు మాడి. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్ర‌ధాన కోణాల‌ని చూపించనున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా,షారూఖ్, సూర్య ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక మాధ‌వ‌న్ భార్య‌గా సిమ్రాన్ క‌నిపించ‌నున్నార‌ట‌. చాలా ఏళ్ళ త‌ర్వాత మాధ‌వ‌న్, సిమ్రాన్ క‌ల‌సి సంద‌డి చేయ‌నున్నార‌నే వార్త‌తో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. పదిహేనేళ్ల తర్వాత తిరు, ఇందిర శ్రీమతి, శ్రీ నంబి నారాయణన్‌గా’ అంటూ రాకెట్రీ మూవీలో సిమ్రన్‌ క్యారెక్టర్‌ను రివీల్ చేశాడు మాధ‌వ‌న్. దేశద్రోహం నేరం కింద ఇస్రో సైంటిస్ట్ అయిన నారాయణను 1994లో అరెస్ట్ చేయడం జరిగింది. తరువాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి తనను అన్యాయంగా నేరంలో ఇరికించిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు.

11893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles