వర్షంలో చిక్కుకున్న మాధవన్, అనుపమ్‌ఖేర్..

Wed,August 30, 2017 05:09 PM


ముంబై : ముంబై నగరాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు కాలనీల్లోకి చెరువులను తలపించేలా నీళ్లు చేరాయి. భారీ వర్షాలకు సామాన్యులతోపాటు సెలబ్రిటీలకు తిప్పలు తప్పడం లేదు. బాలీవుడ్ సెలబ్రిటీలు మాధవన్, అనుపమ్‌ఖేర్‌లు వర్షపు నీటిలో చిక్కుకునిపోయారట. ఈ విషయాన్ని వారే ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.


యాక్టర్ మాధవన్ తన ఇంటికి వెళ్తుండగా కుండపోత వర్షం కురువడంతో మధ్యలోనే చిక్కుకునిపోయాడు. తన ఇంటికి సమీపంలోకి రాగానే మాధవన్ కారు వర్షం నీటిలో నిలిచిపోయింది. దీంతో మాధవన్ కారును అక్కడే వదిలేసి అతి కష్టం మీద ఇంట్లోకి వెళ్లాడు. మాధవన్ కారులో ఉన్నపుడు ఇంటి చుట్టూ కాలనీ ఏ విధంగా ఉందో ఓ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. డీప్ వాటర్..ఎక్సైట్‌మెంట్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వీడియోను షేర్ చేశాడు మాధవన్.

మరోవైపు దర్శకుడు, నటుడు అనుపమ్‌ఖేర్ ప్రయాణిస్తున్న కారు కూడా శాంటాక్రూజ్‌కు సమీపంలో వరద నీటిలో చిక్కుకుని పోయింది. దీంతో అనుపమ్ ఖేర్ బాంద్రాలోని తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ప్రస్తుతం తాను బాంద్రాలోని ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని అనుపమ్‌ఖేర్ ట్వీట్‌చేశాడు.


My silly car down.. had to bail and wade home in thigh deep water.. excitement and frustration...

A post shared by R. Madhavan (@actormaddy) on

2120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles