త‌న బ‌యోపిక్ తీయోద్ద‌ని కోరిన మాధురీ దీక్షిత్

Wed,May 29, 2019 09:32 AM
Madhuri Dixit says dont do to the biopics on me

మూడు ద‌శాబ్ధాల‌కి పైగా త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్. చివ‌రిగా క‌ళంక్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు మాధురీ. ఇందులో బ‌హార్ బేగం అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశారు. క‌ళంక్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ఈ అమ్మ‌డు మీడియాకి కాస్త దూరంగా ఉన్నారు. అయితే మాధురీపై ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ బ‌యోపిక్ చేయాల‌ని ప్లాన్ చేసింది. ఈ క్ర‌మంలో మాధురీని కూడా వారు సంప్ర‌దించార‌ట‌. దీనికి మాధురీ త‌న బ‌యోపిక్ చేయోద్ద‌ని కోరింద‌ట‌. జీవితంలో ఎంతో సాధించాల‌ని ఉంది. నా జీవితంపై బ‌యోపిక్ చేయాల‌నుకునే వారికి ఒక్క‌టి చెప్ప‌ద‌ల‌చుకున్నాను. నా జీవితాన్ని వెండితెర‌పై చూపించ‌డం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచ‌న‌లు ద‌య‌చేసి ఎవ‌రు చేయోద్దు అని మాధురీ దీక్షిత్ అన్నారు.

1280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles