షాంగై ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శితం కానున్న మ‌హాన‌టి

Thu,June 13, 2019 08:49 AM
Mahanati will be screened at Shanghai International Film Festival

అల‌నాటి అందాల న‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. గ‌త ఏడాది విడుద‌లైన మ‌హాన‌టి చిత్రం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెకక్కగా, ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక‌, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. కీర్తి సురేష్ న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు జేజేలు ప‌లికారు. మ‌హాన‌టి చిత్రం ఇప్ప‌టికే ఎన్నో ఘ‌న‌త‌లు సాధించ‌గా, తాజాగా మ‌రో ఘ‌న‌త ఈ మూవీ లిస్ట్‌లో చేరింది. చైనాలోని షాంగై లో జూన్ 15నుండి 24 వరకు 22వ షాంగై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుండ‌గా, ఇందులో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి ఇండియ‌న్ సినిమాగా మ‌హాన‌టి అరుదైన ఘ‌న‌త సాధించింది. స్వ‌ప్న సినిమాస్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని షేర్ చేసింది. కాగా, ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ , సమంత , విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్ర‌సాద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.


861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles