మ‌హ‌ర్షి డైరెక్ట‌ర్‌తో మ‌హేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ..?

Fri,September 20, 2019 09:31 AM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ ఏ ప్రాజెక్ట్ ఎవ‌రితో చేయ‌నున్నాడ‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో మ‌హేష్ త‌ర్వాతి ప్రాజెక్ట్ ఉంటుంద‌ని కొంద‌రు చెబుతుండ‌గా, మరికొంద‌రు మ‌హ‌ర్షితో మ‌హేష్‌కి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిప‌ల్లితో ఉంటుంద‌ని అంటున్నారు. వంశీ ఇప్ప‌టికే మ‌హేష్‌కి స్టోరీ లైన్ వినిపించాడని అది న‌చ్చ‌డంతో స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా మొద‌లు పెట్టాడ‌ని విస్త్రృత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడా లేదంటే వంశీతోనే మ‌రో సినిమా చేస్తాడా అనేది స‌స్పెన్స్‌గా మారింది. రానున్న రోజుల‌లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. మ‌హేష్ తాజా చిత్రంలో ఆయ‌న ఆర్మీ మేనేజ‌ర్‌గా క‌నిపించి అల‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

1873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles