‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్

Wed,April 24, 2019 08:30 PM
Maharshi movie pre release date fixed


సూపర్‌స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల సమక్షంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ జరగనుంది. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. మహేశ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

1483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles