మ‌హేష్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

Sat,March 23, 2019 12:49 PM
maharshi single track released soon

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం మ‌హ‌ర్షి. మే 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ వంటివి రిలీజ్ చేయ‌క‌పోయే స‌రికి అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్ర‌సాద్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మార్చి 29న తొలి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపాడు. అప్ప‌టి వ‌ర‌కు క్యూట్ వీడియోతో ఎంజాయ్ చేయండ‌ని ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి కూతురు ఆద్యా, మ‌హేష్ కూతురు సితార‌తో స‌ర‌దాగా చేసిన డ్యాన్స్ వీడియోని షేర్ చేశాడు రాక్ స్టార్ దేవి. జూనియర్‌ మహర్షి (సితార) తనకు డాన్స్‌ చేయటం నేర్పిస్తోంది అంటూ వీడియోకి కామెంట్ చేశాడు. ఆ మ‌ధ్య దేవిశ్రీ సితార‌, ఆద్య‌ల‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ని షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హ‌ర్షి చిత్రాన్ని పీవీపీ, అశ్వనీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, ఇందులో పూజా హెగ్డే కథానాయిక‌గా న‌టిస్తుంది. అల్ల‌రి నరేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.

6244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles