బిగ్ బాస్ ఫేం పునర్నవి ‘సైకిల్’ టీజర్

Fri,November 15, 2019 05:12 PM


హైదరాబాద్‌: బిగ్‌బాస్‌-3 ఫేం పునర్నవిభూపాలం, మహత్‌ రాఘవేంద్ర కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం సైకిల్‌. ఆట్ల అర్జున్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వివి వినాయక్‌ విడుదల చేశాడు. దురదృష్ణవంతుడి లాటరీని అదృష్టవంతుడి జాతకాన్ని అస్సలు నమ్మకూడదు అంటూ సాగే టీజర్ ఫన్ గా సాగుతుంది. ఈ సినిమాకు జీం సతీశ్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌. ప్రేమకథ నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. కమెడియన్‌ సుదర్శన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహత్‌ రాఘవేంద్ర గతంలో బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ చిత్రంలో నటించాడు. ఈ మూవీ 2013లో విడుదలైంది.

2503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles