స‌మ్మోహ‌నం వేడుక‌కి ముఖ్య అతిధిగా మ‌హేష్ బాబు

Thu,June 7, 2018 12:00 PM
mahesh babu chief guest for pre release event

సుధీర్ బాబు .. అదితీ రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెర‌కెక్కించిన చిత్రం సమ్మోహనం . జూన్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్రం.. సినిమా ప్ర‌పంచానికి సంబంధించిన నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని తెలుస్తుంది. కృష్ణ పుట్టిన రోజు( మే 31) సంద‌ర్భంగా ట్రైల‌ర్ విడుద‌ల చేసారు మేక‌ర్స్‌. ఈ ట్రైల‌ర్‌తో చిత్రంపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఇక జూన్ 10న ఫిలిం న‌గ‌ర్ జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మ‌హేష్ బాబు హాజ‌రు కానున్నాడు. కొద్ది రోజులుగా మ‌హేష్ లుక్ విష‌యంలో కాస్త స‌స్పెన్స్ నెల‌కొన‌గా, ఈ వేడుక‌తో మ‌హేష్ లుక్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. వంశీ పైడిప‌ల్లి చిత్రం కోసం మ‌హేష్ మీసాలు, గ‌డ్డం భారీగా పెంచుతున్నాడ‌ని అంటున్నారు.

కొద్ది సేప‌టి క్రితం సెన్సార్ జ‌రుపుకున్న స‌మ్మాహ‌నం చిత్రంకి యూ స‌ర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు స‌భ్యులు. శ్రీదేవి మూవీస్ బేన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. అదితి రావు హైద‌రి స‌మ్మాహ‌నం చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. చెలియా అనే డ‌బ్బింగ్ చిత్రంతో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మే.

2649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles