మహేశ్‌బాబు హాజరు కావాల్సిందే: నాంపల్లి కోర్టు

Mon,June 12, 2017 06:20 PM


హైదరాబాద్: ‘శ్రీమంతుడు’ కథ వివాదం కేసులో ఆ సినిమా హీరో మహేశ్‌బాబు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో మహేశ్ వ్యక్తిగత హాజరుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో, తనకు బదులు మరొకరు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ మహేశ్‌బాబు నాంపల్లి కోర్టును కోరారు. అయితే మహేశ్ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. చిత్ర నిర్మాత ఎర్నేని శివకు కోర్టు మరోసారి సమన్లు జారీచేసింది. తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు మూవీ తీశారంటూ రచయిత శరత్‌చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..మహేశ్, డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత ఎర్నేని శివకు కోర్టు సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే.

2381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles