మ‌హేష్ బాబు ట్వీట్‌కి విజ‌య‌శాంతి రిప్లై

Fri,September 13, 2019 08:42 AM

మ‌హేష్ బాబు, విజ‌య‌శాంతి 30 ఏళ్ళ క్రితం కోడలు దిద్దిన కాపురం చిత్రంలో క‌లిసి న‌టించారు. అప్పుడు మ‌హేష్ బాల‌న‌టుడిగా ఉంటే ఇప్పుడు హీరోగా విజ‌య‌శాంతితో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్ళ త‌ర్వాత విజ‌య‌శాంతితో క‌లిసి న‌టించ‌డంపై ఆనందంతో పాటు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసిన మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో ఇక్కడే మా ప్రయాణం మొదలైంది. 1989లో కొడుకు దిద్దిన కాపురం మూవీ సెట్స్‌లో.. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్లీ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతిగారితో కలిసి నటిస్తున్నాను. జీవితం అనేది నిజంగా చక్రం వంటిది’’ అని అన్నారు.


ఈ ట్వీట్‌కి స్పందించిన విజ‌య‌శాంతి .. కాలగమనంలో ప్రకృతి మార్పును తీసుకొస్తుంది. అయితే మహేష్ బాబు వ్యక్తిత్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆయన మనసు, హృద‌యం ఆయనకు గొప్ప అభరణం. 1989లో మా కాంబినేషన్ మొదలవ్వడానికి ముందు.. ఇదే రోజు 1980‌లో ‘కిలాడీ కృష్ణుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణగారితో జంటగా నా సినీ ప్రయాణం మొదలైంది. కళ అనేది అనంతం. అది మీలాంటి వారి వల్ల భ్రమణం చేస్తుంది. వారసత్వం ఒక విలువైన సంపద..’’ అని విజయశాంతి తన ట్వీట్‌లో తెలిపారు. మ‌హేష్‌, విజ‌య‌శాంతి క‌లిసి న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.



5864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles