ఇప్ప‌టికైన మేల్కొండి.. అమెజాన్‌ని కాపాడండి

Fri,August 23, 2019 01:01 PM
Mahesh Babu wake up call on amazon

భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు నిత్యం అంటుకుంటూనే ఉంటున్నాయి. బ్రెజిల్‌కు చెందిన ఆ అడ‌వులు ప్ర‌తి ఏడాది రికార్డు స్థాయిలో ద‌గ్ధం అవుతున్నాయి. ఆ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీనిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు,శాస్త్ర‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు దీనిపై స్పందిస్తూ ఉన్నారు. ఊపిరితిత్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి..! ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్‌ని కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నారు. టాలీవుడ్ నుండి మొద‌ట మ‌హేష్ బాబు స్పందించారు.

ఈ వార్త చాలా భాదాక‌రమైన‌ది. 20 శాతం ఆక్సీజ‌న్‌ని అందించే అమెజాన్ అడవులు మంట‌ల‌లో కాలిపోతున్నాయి. ఇప్ప‌టికైన మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. జీవ వైవిధ్యం చాలా దెబ్బతింటుంది. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. పచ్చని వాతావ‌ర‌ణం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. అది మ‌న ఇంటి నుండి ప్రారంభిద్దాం! అని మ‌హేష్ పిలుపునిచ్చారు. సాయిధ‌ర‌మ్ తేజ్, అనుష్క శ‌ర్మ‌, అర్జున్ క‌పూర్, దిశా ప‌ఠానీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు అమెజాన్ అడ‌వుల‌ని కాపాడుకుందాం అని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్స్‌ని కోరారు.

3887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles