ర‌వితేజ కోసం అప్పుడు ప‌వ‌న్, ఇప్పుడు మ‌హేష్ ?

Wed,November 7, 2018 09:10 AM

శ్రీనువైట్ల‌- ర‌వితేజ కాంబినేష‌న్‌లో వచ్చిన ‘నీ కోసం, వెంకీ, దుబాయ్‌ శీను’ వంటి చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’ . మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. ఇలియానా ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌గా, థ‌మ‌న్ సంగీతం అందించారు . సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఈనెల 10న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నాడ‌ని అంటున్నారు. మ‌హేష్‌- శ్రీను వైట్ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన దూకుడు చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అలానే మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో మ‌హేష్ హీరోగా రూపొందిన శ్రీమంతుడు భారీ విజ‌యం సాధించింది . ఈ నేప‌థ్యంలో మ‌హేష్‌కి శ్రీను వైట్ల‌తో, మైత్రి సంస్థ‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయ‌న రావ‌డం ప‌క్కా అని అభిమానులు భావిస్తున్నారు. ర‌వితేజ చివ‌రి చిత్రం నేల టిక్కెట్టుకి ప‌వ‌న్ ముఖ్య అతిధిగా హాజ‌రు కాగా, ఇప్పుడు మ‌హేష్ హాజ‌రుకానుండ‌డం గ‌మ‌న‌ర్హం.

5523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles