మ‌హేష్‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ

Fri,August 9, 2019 08:35 AM
mahesh gets wishes from fans and celebrities

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు త‌న‌ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9, 1975 జన్మించిన సూపర్ స్టార్ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రిన్స్ పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ర‌చ‌యిత‌లు మ‌హేష్‌కి జ‌న్మ‌దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆయ‌న గొప్ప‌తనాన్ని వివ‌రించారు. మ‌రి కొద్ది నిమిషాల‌లో మ‌హేష్ న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు నుండి ఇంట్రో రానుంది. మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో మ‌హేష్ సంద‌డి చేయ‌నున్నాడు. వారం నుండే మ‌హేష్ బ‌ర్త్‌డేకి సంబంధించి హంగామా చేస్తున్న అభిమానులు నేడు ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు.1160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles