సెల్ఫీ ఆఫ్ స‌క్సెస్ పుస్త‌కంపై మ‌హేష్ ప్ర‌శంస‌లు

Fri,August 2, 2019 12:54 PM
Mahesh Lends His Support For Selfie With Success

పుస్త‌క ర‌చ‌యిత‌, ఐఏయ‌స్ అధికారి బుర్రా వెంకటేశం రచించిన” Selfie of Success ” పుస్తక ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఎంద‌రో ప్ర‌ముఖులు ఈ పుస్తకంపై ప్ర‌శంస‌లు కురిపించారు. అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ పుస్తకం థీమ్ మ‌హేష్ తాజాగా న‌టించిన మ‌హ‌ర్షి చిత్ర థీమ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపించారు. Selfie of Success అనే పుస్తకమును ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం గా అభివర్ణించారు . సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అనేది మనిషి యొక్క లోతైన ప్రయాణం మరియు అతని విజయాన్ని సాధించడం గురించి సమగ్రంగా చర్చించారని పేర్కొన్నారు .విజయం మనిషి జీవితంలో ఒక ప్రయాణంగా ఉండాలని వివరంగా తన అభిప్రాయాలను వెల్లడించిన పుస్తక రచయిత బుర్రా వెంకటేశంకి అభినందనలు తెలిపారు మ‌హేష్‌. సెల్ఫీ ఆఫ్ సక్సెస్‌లో మహర్షి ఇతివృత్తంకి సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయ‌ని అన్నాడు. ఈ బుక్‌పై విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్ర‌భాస్ కూడా ప్ర‌శంసలు కురిపించారు.

1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles