క‌శ్మీర్‌లో క్రికెట్‌.. ఉత్సాహంగా కనిపించిన మ‌హేష్‌

Sat,August 10, 2019 08:39 AM
mahesh playing cricket with his son

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. క‌శ్మీర్‌లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే షూటింగ్ బ్రేక్‌లో మ‌హేష్ త‌న త‌న‌యుడు గౌత‌మ్‌, అనీల్ రావిపూడి, మెహ‌ర్ రమేష్‌, వంశీ పైడిప‌ల్లితో క‌లిసి క్రికెట్ ఆడాడు. ఎంతో ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్న మ‌హేష్‌కి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

శుక్రవారం హీరో మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ అధికారి ఆజయ్ కృష్ణగా కనిపించనున్నారు. ర‌ష్మిక మందన్న కథానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేష్‌బాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్నారు.1909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles