ప్ర‌పంచ‌క‌ప్‌లో సంద‌డి చేయ‌నున్న టాలీవుడ్ తార‌లు

Thu,May 16, 2019 09:44 AM
mahesh, venkatesh hungama at world cup

క్రికెట్ మ‌హాసంగ్రామం మే 30 నుండి ఇంగ్లండ్‌లో మొద‌లు కానున్న సంగ‌తి తెలిసిందే. 10 దేశాల మ‌ధ్య ఎంతో ఆసక్తిక‌రంగా సాగ‌నున్న బిగ్ ఫైట్‌ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వెంక‌టేష్‌, మ‌హేష్ బాబు, సురేష్ బాబుకి క్రికెట్ అంటే ప్ర‌త్యేక ఇష్టం. ఛాన్స్ దొరికితే వారు గ్రౌండ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటారు. అయితే ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న వన్డే విశ్వసమరాన్ని వీక్షించేందుకు చాముండేశ్వ‌ర‌నాథ్ నేతృత్వంలో డి.సురేష్‌బాబు, డా.కామినేని శ్రీనివాస్‌, ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, చంద్ర‌కుమార్‌ల‌తో స‌హా విక్ట‌రీ వెంక‌టేశ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఇంగ్లాండ్ వెళుతున్నారట‌. జూన్ 9, జూన్ 13, జూన్ 16 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్ దేశాల‌తో ఇండియా మ్యాచ్‌లు ఆడ‌నుండ‌గా, వాటిని వీక్షించేందుకు వీరు ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ టూర్ పూర్తైన త‌ర్వాత మ‌హేష్ .. అనీల్ రావిపూడితో సినిమా చేయ‌నున్నాడు. ఇక వెంక‌టేష్ ప్ర‌స్తుతం వెంకీ మామ సినిమా చేస్తుండ‌గా, టార్‌కి త‌గ్గ‌ట్టు త‌న డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటున్నాడ‌ట‌.

3264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles