ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌ని వీడ‌నున్న యూట్యూబ్ స్టార్..!

Sun,October 13, 2019 11:20 AM

బుల్లితెర బిగ్ రియాలిటీ షో కార్య‌క్ర‌మం బిగ్ బాస్ సీజ‌న్ 3 మ‌రో రెండు వారాల‌లో ముగియ‌నుంది. 12వ వారంలో మ‌హేష్‌, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్‌లు నామినేష‌న్‌లో ఉండ‌గా, ఇంటి నుండి ఎవ‌రు వెళ‌తార‌నే దానిపై అభిమానుల‌లో ఆస‌క్తి పెరుగుతుంది. మరి కొద్ది గంట‌ల‌లో దీనిపై పూర్తి క్లారిటీ రానుండ‌గా, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మ‌హేష్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. గ‌త వార‌మే మ‌హేష్ ఎలిమినేట్ కావాల్సి ఉన్న‌ప్ప‌టికి అదృష్ట‌వ‌శాత్తు సేఫ్ జోన్‌లో ప‌డ్డాడు. ఈ వారం మాత్రం మ‌హేష్ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌డం ప‌క్కా అని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. గేమ్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయ‌కపోవ‌డం, రెండు నాలుక‌ల ధోర‌ణితో విసిగిపోయిన నెటిజ‌న్స్ మ‌హేష్‌ని ఇంటి నుండి బ‌య‌ట‌కి పంపిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంద‌ని, మ‌హేష్‌తో పాటు రాహుల్ కూడా ఎలిమినేట్ అవుతార‌ని అంటున్నారు. చూడాలి మ‌రి ఈ రోజు బిగ్ బాస్ హౌజ్‌లో ఏం జ‌రుగుతుందో.

6275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles