మేజర్ చిత్రంపై మహేశ్ ఆసక్తికర కామెంట్లు

Tue,March 5, 2019 07:42 PM


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా మేజర్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎందుకు చేయడం లేదని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు మహేశ్. ప్రేక్షకులకు చూపించాల్సిన కొన్ని కథలుంటాయి. మేజర్ చిత్రం కూడా అలాంటిదే. ఈ సినిమాలో నాకు నటించాలని ఉన్నా..కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. మేజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు. ఈ చిత్రం కోసం అడివి శేష్ చాలా పరిశోధన చేశాడు. ఈ పాత్రకు అడివిశేష్ సరిగ్గా సరిపోతాడనిపించినట్లు మహేశ్ చెప్పాడు. ఎన్ఎస్ జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అడివి శేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.2341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles