మ‌జిలీ నుండి మ‌రో డిలీటెడ్ సీన్

Sat,April 20, 2019 11:26 AM
Majili Movie Deleted Scene 2 released

నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మ‌జిలీ. ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం స‌మ్మ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల డిలీట్ సీన్‌ని విడుద‌ల చేశారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మ‌రో డిలీట్ సీన్ రిలీజ్ చేశారు. ఇందులో చైతూ.. పోసాని కృష్ణ ముర‌ళీని మామ‌య్య అన‌డం, ఆయ‌న ఎమోష‌న్ కావ‌డం ఇందులో చూడొచ్చు. ఈ చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌లో రీమేక్ అయ్యేందుకు సిద్దంగా ఉంద‌ని అంటున్నారు. కోలీవుడ్ మీడియా ప్ర‌కారం మ‌జిలీ చిత్ర రీమేక్ రైట్స్ స్టార్ హీరో ధనుష్ ద‌క్కించుకున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో హీరోగా ధ‌నుష్ న‌టిస్తాడా లేదంటే మ‌రో హీరోతో చేస్తాడా అనేది చూడాలి.


2386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles