మ‌జిలీ నుండి నాలుగో డిలీటెడ్ సీన్

Fri,April 26, 2019 11:35 AM
Majili Movie Deleted Scene 4

స‌మ్మ‌ర్‌లో చ‌ల్ల‌ని వినోదాన్ని పంచిన ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మ‌జిలీ. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో స‌మంత‌, నాగ చైత‌న్య‌, దివ్యాంశ కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 5న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికి మంచి కలెక్ష‌న్స్ రాబ‌డుతుంది. అయితే కొద్ది రోజులుగా చిత్రం నుండి తొల‌గించిన స‌న్నివేశాల‌ని ఒక్కొక్క‌టిగా వీడియో రూపంలో విడుద‌ల చేస్తున్నారు. తాజాగా డిలీటెడ్ సీన్ 4 పేరుతో ఓ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో చైతూ అండ్ గ్యాంగ్ డ‌బ్బుల కోసం హార్బ‌ర్‌లో దొంగ‌త‌నానికి వెళ‌తారు. అక్క‌డ దొంగిలించిన వ‌స్తువుల‌ని అమ్మి వ‌చ్చిన మొత్తాన్ని ఓ వ్య‌క్తికి ఇచ్చి గ్రౌండ్‌లో దిగేందుకు సిద్ద‌మ‌వుతారు. వాటికి సంబంధించిన స‌న్నివేశాల‌ని తాజా వీడియోలో చూపించారు. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందించ‌గా, ముఖ్య పాత్ర‌ల‌లో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, రాజశ్రీ నాయర్ నటించారు.

1457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles