త‌మిళంలో రీమేక్ కానున్న మ‌జిలీ

Thu,April 18, 2019 01:36 PM
Majili Movie remake in tamil

వివాహం త‌ర్వాత నాగ చైత‌న్య‌, స‌మంత తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం మ‌జిలీ. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 50 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. రానున్న రోజులలో మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంటున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా క‌నెక్ట్ అయ్యారు. ఈ చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌లో రీమేక్ అయ్యేందుకు సిద్దంగా ఉంద‌ని అంటున్నారు. కోలీవుడ్ మీడియా ప్ర‌కారం మ‌జిలీ చిత్ర రీమేక్ రైట్స్ స్టార్ హీరో ధనుష్ ద‌క్కించుకున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో హీరోగా ధ‌నుష్ న‌టిస్తాడా లేదంటే మ‌రో హీరోతో చేస్తాడా అనేది చూడాలి. ధ‌నుష్ ప్ర‌స్తుతం అసుర‌న్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles