ల‌వ్ స్టోరీతో ర‌మ్మ‌ని సుకుమార్‌కి స‌ల‌హా ఇచ్చిన బన్నీ..!

Sun,August 25, 2019 12:38 PM
Major change in Allu Arjun 21 movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రం చేస్తున్న బ‌న్నీ త‌న 20వచిత్రంగా ఐకాన్ అనే సినిమా చేయ‌నున్నాడు. ఇక 21వ చిత్రంగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య‌2 చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే సుకుమార్ తెర‌కెక్కించే ప్రాజెక్ట్ శేషచలం అటవీ నేపథ్యంలో గంధపు అక్రమ రవాణా గురించి ఉంటుంద‌ట‌. ఇదే కథతో మహేష్ హీరోగా సినిమా చేయాల‌ని అనుకున్నప్ప‌టికి అది కుద‌ర‌లేదు. ఇప్పుడు సేమ్ స్టోరీతో బ‌న్నీతో సినిమా చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు సుక్కూ. కాని బ‌న్నీ ల‌వ్ స్టోరీతో సినిమా చేద్ధామ‌ని సుకుమార్‌కి స‌లహా ఇచ్చాడ‌ట‌. మ‌రి ఇందులో ఎంత నిజ‌ముంద‌నేది తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు.

1330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles