'ఆర్ఆర్ఆర్' టీం నుండి స‌రికొత్త పోస్టర్

Wed,May 1, 2019 11:05 AM
Makers Encouraging Netizens To Come Up With More titles

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్ర‌ల‌లో న‌టిస్తుండ‌గా, అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. చ‌ర‌ణ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డింది. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో జ‌ర‌ప‌నున్నారు. ఆ త‌ర్వాత పూణేకి చెక్కేయ‌నుంది చిత్రబృందం. అయితే ఈ మల్టీ స్టార‌ర్ మూవీకి అన్ని భాష‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, ఎక్స్‌ప్యాన్ష‌న్ మాత్రం మారనుంది. సినీ ప్రియులు సినిమా స్టోరీకి త‌గ్గ‌ట్టు స‌రైన అబ్రివేష‌న్స్ పంపించమ‌ని రాజ‌మౌళి ప్రెస్‌మీట్‌లో తెలిపిన విష‌యం తెలిసిందే. దీనికి నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని భాష‌ల‌లో ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి ప‌లు అబ్రివేష‌న్స్ పంపుతున్నారు. అందులో బ‌ల‌మైన‌, ఆస‌క్తిక‌ర‌, ఆలోచించ‌ద‌గ్గ టైటిల్స్‌ని పోస్ట‌ర్ రూపంలో పొందుప‌ర‌చి రిలీజ్ చేశారు. మ‌రిన్నిఆస‌క్తిక‌ర టైటిల్స్ పంపండ‌ని కూడా కోరారు. జూలై 30,2020న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డీవీవీ దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles